
ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడితే అధికారంలోకి రారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రజల మనసులు గెలిస్తే అధికారంలోకి రావడం సాధ్యమవుతుందంటూ ఆమె ప్రతిపక్ష నేతలకు హితవు చెప్పారు. సీఎం కేసీఆర్ పై కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, వారికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్ నాయకులపై ఉందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొంత మంది స్థాయికి మించి సీఎం కేసీఆర్‌పై నోరు పారేసుకుంటున్నారన్నారు. ఇది ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు గమనించి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పోడు భూముల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు పనులు జరుగుతున్నాయని తెలిపారు.