చట్టం ముందు అందరూ సమానులేనని తప్పు చేస్తే శిక్ష తప్పదన్నారు మంత్రి సీతక్క. సామాన్యుడైనా కేంద్ర మంత్రి కొడుకైనా ప్రభుత్వ దృష్టిలో అందరూ ఒక్కటేనన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ విషయంలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందన్నారు.. నిందితుడు బండి అయినా బండ అయినా సరే ప్రభుత్వం ఎవరికీ తలవంచదు ఎవరినీ ఉపేక్షించదన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు సీతక్క.
వరంగల్‌లో తొమ్మిది నెలల పసికందుపై అత్యాచారం జరిగినా, చైత్ర , దిశా ఘటనలు చోటుచేసుకున్నా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదన్నారు సీతక్క. కానీ తమ ప్రభుత్వం ఫిర్యాదు అందిన వెంటనే బండి సంజయ్ కొడుకుపై కేసు నమోదు చేసిందన్నారు. లోతైన విచారణ కోసం ప్రత్యేకంగా సిట్ (SIT) ను ఏర్పాటు చేశామని చెప్పారు. మహిళలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ కేసులో ఎంతటి వారున్నా ఎంతటి పలుకుబడి ఉన్నా వదిలిపెట్టేది లేదని చెప్పారు సీతక్క.
