తెలంగాణలో 12 మంది ఐపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల బదిలీ.. సైబరాబాద్ ట్రాఫిక్ సీపీగా సన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ సింగ్‌‌‌‌

తెలంగాణలో 12 మంది ఐపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల బదిలీ.. సైబరాబాద్ ట్రాఫిక్ సీపీగా సన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ సింగ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పోలీస్ అధికారుల బదిలీలు జరిగాయి. 12 మంది ఐపీఎస్‌‌‌‌లు, 22 మంది నాన్‌‌‌‌కేడర్‌‌‌‌ ఎస్పీలతో పాటు 36 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. ఈ మేరకు ఐపీఎస్‌‌‌‌ల బదిలీలకు గాను సీఎస్‌‌‌‌ రామకృష్ణారావు, నాన్‌‌‌‌ కేడర్‌‌‌‌‌‌‌‌ ఎస్పీలకు గాను హోంశాఖ ముఖ్యకార్యదర్శి శిఖా గోయల్‌‌‌‌, డీఎస్పీలకు గాను డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ సోమవారం విడివిడిగా ఉత్తర్వులు జారీ చేశారు. 

హైదరాబాద్ సిటీ నార్త్ రేంజ్ లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్‌‌‌‌గా ఉన్న ఎన్.శ్వేతను వరంగల్ పోలీస్ కమిషనర్‌‌‌‌ నియమించడంతో పాటు  భద్రాద్రి జోన్-4 డీఐజీ అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు. ప్రస్తుతం వరంగల్‌‌‌‌ సీపీగా పనిచేస్తున్న సన్‌‌‌‌ప్రీత్‌‌‌‌సింగ్‌‌‌‌ సైబరాబాద్‌‌‌‌ ట్రాఫిక్‌‌‌‌ జాయింట్‌‌‌‌ సీపీగా నియమించారు.  రాజన్న సిరిసిల్ల డీఐజీ జోన్-3 పూర్తి అదనపు బాధ్యతలను  అప్పగించారు.-రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకు కాళేశ్వరం జోన్-1 డిప్యూటీ ఇన్‌‌‌‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.-

యాదాద్రి జోన్‌‌‌‌–5 డీఐజీగా జోయెల్‌‌‌‌ డేవిస్‌‌‌‌కు అదనపు బాధ్యతలు

హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ డి.జోయెల్ డేవిస్‌‌‌‌కు యాదాద్రి జోన్-5 డీఐజీ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.- ఇంటెలిజెన్స్ సీఐ సెల్ డీఐజీ ఆర్.భాస్కరన్‌‌‌‌కు బాసర జోన్-2 డీఐజీ అదనపు బాధ్యతలు ఇచ్చారు.- హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఎస్.ఎం. విజయ్ కుమార్‌‌‌‌‌‌‌‌కు హైదరాబాద్ నార్త్ రేంజ్ లా అండ్ ఆర్డర్ జాయింట్ సీపీ అదనపు బాధ్యతలు అప్పగించారు.- 

ఏసీబీలో జాయింట్ డైరెక్టర్‌‌‌‌గా పనిచేస్తున్న సింధు శర్మను ఇంటెలిజెన్స్ సీఐ సెల్ ఎస్పీగా, ఎస్‌‌‌‌ఐబీ ఎస్పీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎస్‌‌‌‌ఐబీలో ఎస్పీగా ఉన్న  వై.సాయి శేఖర్‌‌‌‌‌‌‌‌ను సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా నియమించారు.- హైదరాబాద్ సిటీ ఐటీ డీసీపీ చెర్నూరి రూపేశ్‌‌‌‌ను సీఐడీ ఎస్పీగా బదిలీ చేశారు.- 

ఏసీబీ జాయింట్ డైరెక్టర్  ప్రవీణ్ కుమార్ ను సీఐడీ ఎస్పీగా నియమించారు. పోస్టింగ్‌‌‌‌ కోసం వెయిటింగ్‌‌‌‌లో ఉన్న  ఆర్.వెంకటేశ్వర్లును హైదరాబాద్ సిటీ సీఏఆర్ ప్రధాన కార్యాలయం డీసీపీగా నియమించారు.- వనపర్తి అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా ఉన్న రాజేశ్ మీనాను వికారాబాద్ అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేశారు.

36 మందికి డీఎస్పీలుగా పదోన్నతి 

రాష్ట్రవ్యాప్తంగా 22 మంది నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖాగోయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్తర్వులిచ్చారు. బదిలీ అయిన వారు నూతన స్థానాల్లో విధుల్లో చేరేలా తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించారు. అదేవిధంగా పోస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం వెయిటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్పీ జి బస్వారెడ్డిని విజిలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్పీగా పోస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు.

 గ్రేహౌండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీఐడీ, ఈగల్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ , రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల యూనిట్లు, కమిషనరేట్ల పరిధిలో వెయిటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న వారికి పో స్టింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతో పాటు పలువురిని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వుల్లో పూర్తి వివరాలు వెల్లడించారు. మరోవైపు సర్కిల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ (సీఐ) హోదా నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా పదోన్నతి పొందిన 36 మందిని రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, యూనిట్లలో పోస్టింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. నూతనంగా పదోన్నతి పొందిన అధికారులను డీజీపీ సి.వి.ఆనంద్ అభినందించారు.