ఫాదర్స్ డే సందర్భంగా మంత్రి సీతక్క స్వగ్రామమైన ములుగు మండలం జగ్గన్నపేటలో తన తండ్రి సమ్మయ్యను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సన్మానించి, ఆశీర్వాదం తీసుకున్నారు. తన జీవితంలో తండ్రి సమ్మయ్య పాత్ర ఎంతో గొప్పదన్నారు.
అనంతరం తల్లిదండ్రులు ధనసరి సమ్మక్క, సమ్మయ్యతో కలిసి కొంతసేపు సంతోషంగా గడిపారు. కన్నేపల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు బోదెబోయిన సమ్మయ్య భార్య వేణి (50) మృతి చెందగా, భౌతికికాయానికి నివాళులర్పించారు.- వెంకటాపూర్(రామప్ప)/ తాడ్వాయి, వెలుగు
