మహిళల ఆర్థిక స్థితిగతిని మార్చాలె : మంత్రి సీతక్క

మహిళల ఆర్థిక స్థితిగతిని మార్చాలె : మంత్రి సీతక్క

మహిళల ఆర్థిక స్థితిగతిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి సీతక్క.  -గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలని వ్యాపారవేతలుగా మార్చాలని చెప్పారు. ఆయా జిల్లాలలో లోకల్ గా దేనికి డిమాండ్ ఎక్కువగా ఉందొ... అందులో మహిళలతో బిజినెస్ పెట్టించాలని తెలిపారు. - మనదగ్గర ఉన్న వనరులని మనమే వాడుకోవాలి... కార్పొరేట్ సంస్థలు కాదన్నారు సీతక్క. - అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేయూత కల్పించేందుకు రెడీగా ఉందని వెల్లడించారు. రాజేంద్ర నగర్ లోని పంచాయత్ రాజ్ & గ్రామీణాభివృద్ధి సంస్థలో మహిళా ఉన్నతి - తెలంగాణ ప్రగతి అంశంపై మీటింగ్ కండక్ట్ చేశారు సీతక్క. 

-మహిళా శక్తిని ఒక బ్రాండ్ గా తీర్చిదిద్దాలన్నారు మంత్రి సీతక్క.  మహిళా శక్తిపై  సీఎం రేవంత్ రెడ్డికి గట్టి నమ్మకం ఉందనన్నారు.  - కార్పొరేట్ సంస్థలకి ధీటుగా మహిళా శక్తిని తీర్చిదిద్దాలని చెప్పారు  సీతక్క.  గ్రామీణ మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని చెప్పుకొచ్చారు.- ఈ అంశంపై త్వరలోనే ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు.  బయట ఏ హోటల్ లో తిన్నా... రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని..  చివరికి చిన్నారుల దగ్గర  తాగే పాలను కూడా కల్తీ చేస్తున్నారని చెప్పారు.  - ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.