
జూబ్లీహిల్స్ లో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. స్టార్ క్యాంపెయినర్లంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున మంత్రి సీతక్క బోరబండలో ప్రచారం చేశారు. కార్పొరేషన్ చైర్మన్లు మువ్వా విజయ్ కుమార్, బండ్రు శోభారాణి, స్థానిక కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తో కలిసి మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీతక్క.. జూబ్లీహిల్స్ లో రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని.. అధికార కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని మంత్రి సీతక్క ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కు మూడు సార్లు అవకాశం ఇచ్చినా అభివృద్ధి జరగలేదు. కనీస సదుపాయాలు కరు వయ్యాయి. రేషన్ కార్డులు ఇవ్వలేదు. అందుకే జూబ్లీహిల్స్ నియోజవర్గం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాలి. నవీన్ యాదవ్ ఎక్కడ కష్టం వచ్చినా వాలిపోతాడు. పేదల సంక్షేమం కోసం ఫ్రీ కరెంట్, ఉచిత బస్సు రవాణా, లక్షల సంఖ్యలో రేషన్ కార్డులు పంపిణీ చేశాం. సన్నబియ్యం ఇస్తు న్నం. 4.5 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నం' అని అన్నారు.