మహిళలకు గుడ్ న్యూస్: జూన్ 2న ప్రతి మండలానికి ఆర్టీసీ బస్సు

మహిళలకు గుడ్ న్యూస్:  జూన్ 2న ప్రతి మండలానికి ఆర్టీసీ బస్సు

మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని  మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సముదాయంలో ఒక వినూత్న కార్యక్రమం జరిగింది. స్నేహ మహిళా సంఘాల సముదాయం ఆధ్వర్యంలో, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన మాక్ పార్లమెంట్ అందరినీ ఆకట్టుకుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 15 నుంచి 18 సంవత్సరాల లోపు వయసున్న యువతులు, మహిళలు ప్రతి ఒక్కరూ ‘స్నేహ మహిళా సంఘంలో చేరి ఆర్థికంగా లాభం పొందాలని పిలుపునిచ్చారు. అంతేకాదు, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకోబోయే మరికొన్ని కీలక నిర్ణయాలను ఆమె వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి రాష్ట్రవ్యాప్తంగా  సుమారు 600 బస్సులను ప్రతి మండలానికి  కేటాయించబోతున్నట్లు ప్రకటించారు. అలాగే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యా రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తు చేస్తూ.. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కాకముందే ఈసారి ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాం దుస్తులను అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

►ALSO READ | మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన.. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్