ములుగు, వెలుగు: రాఖీ పండుగను రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఒకరోజు ముందు వినూత్నంగా జరుపుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, అనుచరులకు ఆకులు, పువ్వులతో తయారు చేసిన రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ములుగు డీఆర్డీవో సంపత్రావు ఆధ్వర్యంలో రావి, మామిడి ఆకులతోపాటు చామంతి, గులాబీ, మందార, బంతి, రామబాణం పూలతో ప్రత్యేకంగా రాఖీలను తయారు చేయించారు. ఆదివారం ములుగు పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఈ రాఖీలను కలెక్టర్ దివాకర, డీఆర్డీవో సంపత్రావు, ఇతరులకు కట్టారు.
