ఇయ్యాల సౌదీలో జెడ్డా ఇన్వెస్ట్​ ఇన్​ తెలంగాణ రోడ్​ షో : శ్రీధర్​బాబు

ఇయ్యాల సౌదీలో జెడ్డా ఇన్వెస్ట్​ ఇన్​ తెలంగాణ రోడ్​ షో : శ్రీధర్​బాబు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘జెడ్డా ఇన్వెస్ట్​ ఇన్​ తెలంగాణ’ రోడ్​షోలో పాల్గొనేందుకు మంత్రి శ్రీధర్​బాబు శనివారం సౌదీ అరేబియాకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన పలు కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఉదయం 9 గంటలకు సెడ్కో కేపిటల్స్ ప్రతినిధులతో సమావేశమవుతారు. 

10 గంటలకు జెడ్డా ఛాంబర్స్​తో మీటింగ్​లో పాల్గొంటారు. ఆ తర్వాత ఆహార ఉత్పత్తుల దిగ్గజ సంస్థ సవోలా గ్రూప్ సీఈవో వలీద్ ఫతానాతో మంత్రి చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సౌదీ బ్రదర్స్ కమర్షియల్ కంపెనీ సీఈవో,  బోర్డ్ సభ్యులతో సమావేశమవుతారు. ఆ తర్వాత పెట్రోమిన్ కార్పొరేషన్ హెడ్​క్వార్టర్స్ సందర్శించి ఆ సంస్థ ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చిస్తారు. ఆ తర్వాత బట్టర్జీ హోల్డింగ్ కంపెనీ చైర్మన్ మాజెన్ బెట్టర్జీతోపాటు అరామ్​కో సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. రాత్రి 7 గంటలకు షెరటన్ హోటల్ లో నిర్వహించే ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ రోడ్ షోలో మంత్రి పాల్గొంటారు.