300 కోట్లతో స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్లు : మంత్రి శ్రీధర్ బాబు

300 కోట్లతో స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్లు : మంత్రి శ్రీధర్ బాబు
  • రాష్ట్రంలో ఏర్పాటుకు 10 విదేశీ వర్సిటీలు ఓకే
  • ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్, స్టార్టప్ రన్​వే సంస్థల ప్రతినిధులతో భేటీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రూ.300కోట్లతో స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్లను నెలకొల్పేందుకు విదేశాలకు చెందిన పది యూనివర్సిటీలు ముందుకొచ్చాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ 25 దేశాలకు విస్తరించిన ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్(ఐఎస్ఎఫ్), టెక్సాస్​కు చెందిన స్టార్టప్ రన్​వే సంస్థ ప్రతినిధులతో మంగళవారం సెక్రటేరియెట్​లో ఆయన సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్​లను ప్రోత్సహించే ఈ రెండు సంస్థలకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, లండన్ బిజినెస్ స్కూల్ లాంటి పది ప్రముఖ వర్సిటీలతో శిక్షణకు సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయని తెలిపారు.

హైదరాబాద్​లో సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు జరిగే ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ సదస్సులో ఆయా యూనివర్సిటీల ప్రతినిధులు కూడా పాల్గొంటారని మంత్రి తెలిపారు. ఐఎస్ఎఫ్ చైర్మన్ జేఏ చౌదరి, డైరెక్టర్ శేషాద్రి వంగల ఆధ్వర్యంలో టెక్సాస్ రిచర్డ్ సన్ సిటీ, ఫ్రిస్కో సిటీల ప్రతినిధులు తనను కలిసి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ’లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించారన్నారు.

అమెరికా, బ్రిటన్​కు చెందిన కంపెనీలు ఏఐ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు సంధానకర్తలుగా ఉంటాయని వెల్లడించారు. తెలంగాణలోని స్టార్టప్​ కంపెనీల ఉత్ప
 త్తులకు అమెరికాలో మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడానికి వారు సహకరిస్తారని చెప్పారు.