కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొస్తాం

కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొస్తాం

హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్ను నిర్మిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నెక్లెస్ రోడ్డులో నిర్మిస్తున్న నీరా కేఫ్ పనులను గౌడ సంఘాల ప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కుల, చేతి వృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగా రూ. 25 కోట్లతో నీరా కేఫ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇచ్చే ఎక్స్గ్రేషియాను.. రైతు భీమా తరహాలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోకాపేటలో రూ. 300 కోట్ల విలువైన భూమిని కల్లు గీత భవనం కోసం సీఎం కేసీఆర్ కేటాయించారన్నారు. రాష్ట్రంలో నీరా ఉత్పత్తి కోసం యాదాద్రి, సంగారెడ్డి, రంగారెడ్డి,  జిల్లాల్లోని పలు గ్రామాల్లో నీరా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. 

For More News..

ప్రభుత్వ వాహనాలకు కూడా స్టిక్కర్లు తీసేయాలి

ఈటల లేని పార్టీ తండ్రి లేని కుటుంబంలా మారింది

వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన కోదండరాం