పాదయాత్ర పేరుతో  పాలమూరు విచ్ఛిన్నానికి కుట్ర

పాదయాత్ర పేరుతో  పాలమూరు విచ్ఛిన్నానికి కుట్ర

పాదయాత్రల  పేరుతో కులం- మతం  అంటూ బీజేపీ  రెచ్చగొట్టే  రాజకీయాలు చేస్తోందన్నారు మంత్రి  శ్రీనివాస్ గౌడ్. ఆధారాలు లేకుండా  ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. బెదిరింపులకు పాల్పడేది  బండి సంజయ్  అన్నారు. కాళేశ్వరం  ప్రాజెక్టులో అవినీతి  జరగలేదని  పార్లమెంటులో కేంద్రమంత్రే  చెప్పారన్నారు. కేంద్రం  రాష్ట్ర పథకాలను  కాపీ కొడుతుందన్నారు.   యాదాద్రి ఆలయం కట్టినా  హిందూత్వం అనే  మాటలతో  టీఆర్ఎస్ రాజకీయాలు  చేయలేదన్నారు. గత అధ్యక్షులను  చూసి  బండి సంజయ్  నేర్చుకోవాలన్నారు. ఇష్టానుసారంగా  మాట్లాడితే ..పడేవాళ్లు లేరని.. కుటుంబం  గురించి మాట్లాడే  హక్కు లేదన్నారు. బండి సంజయ్ స్టంట్ మాస్టర్ అని అన్నారు. తాము ఎదురు తిరిగితే బండి సంజయ్ రోడ్లపైన తిరగగలరా? అని ప్రశ్నించారు  మంత్రి శ్రీనివాస్ గౌడ్. పాదయాత్ర పేరుతో  పాలమూరును విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందన్నారు.  రాష్ట్ర ఏర్పాటును అవమానించారన్నారు. పాలమూరుకు జాతీయ హోదా ఇస్తానని మోసం చేశారన్నారు