తెలుగు స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సుధాకర్ తరపున నాలుగు రోజులు ప్రచారం చేశారు. ఈ స్థానంలో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ లీడ్ లో ఉన్నారు. మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత ప్రదీప్ ఈశ్వర్.. బీజేపీ అభ్యర్థి.. బ్రహ్మానందం స్నేహితుడు సుధాకర్ పై 3 వేల 299 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు అధికం.
ఈ క్రమంలోనే గత ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి సుధాకర్ తరపున బ్రహ్మానందం ప్రచారం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సుధాకర్ గెలుపొందారు. ఇదే సెంటిమెంట్ ను రిపీట్ చేయాలనే ఉద్దేశంతో.. సుధాకర్ తన ఫ్రెండ్ బ్రహ్మానందంతో చక్ బల్లాపూర్ నియోజకవర్గంలో నాలుగు రోజులపాటు ప్రచారం చేయించారు. అయితే ప్రస్తుతం ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పూర్తి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తి రేపుతోంది.
