హైదరాబాద్ మియాపూర్ లో  ట్రాన్స్ఫార్మర్ పేలి వాహనాలు దగ్ధం

హైదరాబాద్ మియాపూర్ లో  ట్రాన్స్ఫార్మర్ పేలి వాహనాలు దగ్ధం

మియాపూర్‌‌‌‌‌‌‌‌, వెలుగు: అధిక లోడ్ కారణంగా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్ పేలి పక్కనే నిలిపి ఉంచిన వాహనాలు మంటల్లో దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, హఫీజ్‌‌‌‌‌‌‌‌పేట్ మార్తాండనగర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్ సోమవారం అర్ధరాత్రి హెవీ లోడ్‌‌‌‌‌‌‌‌ను తట్టుకోలేక భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలింది. 

ఈ ప్రమాదంలో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్ సమీపంలో పార్క్ చేసి ఉంచిన ఒక టాటా ఏస్ వాహనం, రెండు బైకులు మంటల్లో కాలిపోయాయి. ఫైర్​ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్ పేలిపోవడంతో మార్తాండనగర్ ప్రాంతంలో రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.