జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయ హుండీ ఆదాయం రూ. 26.96 లక్షలు

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయ హుండీ ఆదాయం రూ. 26.96 లక్షలు

అలంపూర్, వెలుగు : అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. గత 159 రోజులకు గాను బాల బ్రహ్మేశ్వర స్వామి హుండీ ద్వారా రూ. 24,77,093, అన్నదాన సత్రం హుండీ ద్వారా రూ. 2,19,210.. ఇలా మొత్తం కలిపి రూ. 26,96,303 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో దీప్తి వెల్లడించారు.

నగదుతో పాటు 8 యూఎస్ డాలర్లు, 20 ఆస్ట్రేలియా డాలర్లు, 10 కెనడా డాలర్లతో పాటు 100 మిశ్రమ బంగారం, 20.500 గ్రాముల మిశ్రమ వెండి లభించినట్లు తెలిపారు. మహబూబ్ నగర్ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ మదనేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగింది.