‘హిట్ అండ్ రన్’కు టెక్నాలజీ పరిష్కారం

‘హిట్ అండ్ రన్’కు టెక్నాలజీ పరిష్కారం

కేంద్ర రవాణా శాఖ కీలక సూచన   

న్యూఢిల్లీ :  యాక్సిడెంట్ (హిట్ అండ్ రన్) కేసుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన శిక్షలకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర రవాణా శాఖ కీలక సూచన చేసింది. శుక్రవారం కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ సెక్రటరీ అనురాగ్ జైన్ వెల్లడించారు. ‘‘యాక్సిడెంట్ జరిగిన తర్వాత బాధితులకు సాయం చేసేందుకు అక్కడే ఉంటే స్థానికులు తమపై దాడి చేసే ప్రమాదం ఉందని డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు.

దీనికి పరిష్కారంగా టెక్నాలజీని వాడుకోవచ్చు. యాక్సిడెంట్ విషయాన్ని అధికారులకు తెలియజేసేందుకు డ్రైవర్లకు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తేవాలి.  అలా సమాచారం ఇచ్చిన సందర్భాల్లో దానిని హిట్ అండ్ రన్ కేసుగా పరిగణనలోకి తీసుకోకుండా ఉండొచ్చు” అని పేర్కొన్నారు.