డబుల్ బెడ్‌రూమ్‌‌లు సూడాల్నా.. రండి సూపిస్తం

డబుల్ బెడ్‌రూమ్‌‌లు సూడాల్నా.. రండి సూపిస్తం

హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పేదలపై ఒక్క రూపాయి భారం వేయకుండా డబుల్ బెడ్‌రూమ్‌‌లను కడుతున్నామని స్పష్టం చేశారు. బీజేపీ జీవిత కాలంలో కూడా ఇన్ని ఇళ్లను నిర్మించలేదని, కేవలం మాటలకే పరిమితం అవుతుందని విమర్శించారు.

‘ముఖ్యమంత్రి కేసీఆర్ మాట చెప్తే అది ఒక చట్టం. ఆయనేం చెప్పినా అది చేసి చూపిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో డబుల్ బెడ్‌‌రూమ్‌లను నిర్మిస్తున్నాం. గాంధీ నగర్, శ్రీరామ్ నగర్‌‌లో కోట్ల రూపాయలతో ఇళ్లు కట్టాం. ఒక్కో ఇంటిని 7 లక్షల పైచిలుకు డబ్బులు వెచ్చించి నిర్మించాం. కంటోన్మెంట్‌‌ను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ టీఆర్ఎస్ సర్కార్ వచ్చాక కంటోన్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. కంటోన్మెంట్ పరిధిలో ఖాళీగా ఉన్న బీ3, బీ4 జాగాను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి లేదంటే రాబోయే రోజుల్లో వేలాది మందితో కంటోన్మెంట్ బోర్డ్ ఆఫీస్‌‌ను ముట్టడిస్తాం. కాంగ్రెస్ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతుండ్రు. గతంలో ఎన్నో సంవత్సరాలు దేశాన్ని ఏలిండ్రు. బీజేపీ నాయకులు లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్కడా అని అడుగుతున్నారు.. రండి చూపిస్తాం’ అని తలసాని సవాల్ విసిరారు.