ఖైరతాబాద్లో పట్టణప్రగతి ప్రారంభించిన మంత్రి తలసాని

ఖైరతాబాద్లో పట్టణప్రగతి ప్రారంభించిన మంత్రి తలసాని

రాజకీయాలకు అతీతంగా పట్టణప్రగతిలో ప్రతి ఒక్కరు భాగమవ్వాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఖైరతాబాద్ లోని సీఐబి క్వార్టర్ వద్ద ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. హరితహారంలో భాగంగా వారు మొక్కలు నాటారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ పట్టణ ప్రగతిపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా పట్టణప్రగతి కార్యక్రమం ఘనంగా ప్రారంభమైందని మంత్రి తెలిపారు. శుభ్రత, పరిశుభ్రత ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.

హైదరాబాద్ లో నాలాల వర్క్ వేగంగా కొనసాగుతోందని..కాలనీలను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. డబ్బు ఎక్కువ ఖర్చైన సరే వీడీసీసీ రోడ్లు వేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ప్రాంత సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని..అప్పుడే త్వరగా పరిష్కారమవుతాయని సూచించారు. టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.  అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నట్లు తెలిపారు. దేశంలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతుందన్నారు.

మరిన్ని వార్తల కోసం

కోల్కత్తాలో 10 నిమిషాల్లో లిక్కర్ డెలివరీ

 

పేరు మార్చుకున్న దేశం