కోల్కత్తాలో 10 నిమిషాల్లో లిక్కర్ డెలివరీ

కోల్కత్తాలో 10 నిమిషాల్లో లిక్కర్ డెలివరీ

కోల్కత్తాలో వినూత్న సేవలు ప్రారంభించింది హైదరాబాద్ కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ. 10నిమిషాల్లోనే మద్యం డెలివరీ చేయడం దీన్ని స్పెషల్. ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్  బూజీ అనే పేరుతో ఈ సేవలు ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకమైన టెక్నాలజినీ ఉపయోగిస్తామని చెబుతోంది. దేశంలో పది నిమిషాల్లోనే మద్యం డెలివరీ చేస్తున్న ఏకైక వేదిక తమదేనని..ఇప్పటికే పలు కంపెనీలు మద్యాన్ని హోం డెలివరీ చేస్తున్నా ఇంత తక్కువ టైంలో చేయడం లేదని వెల్లడించింది.

పశ్చిమ బెంగాల్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అనుమతితో బూజీ ఈ సేవలు ప్రారంభించింది. దగ్గర్లోని షాప్ నుంచి మద్యం తీసుకుని డెలివరీ చేస్తుంది ఈ సంస్థ. సరికొత్త ఏఐ టెక్నాలజీ ద్వారా పది నిమిషాల్లోనే సరాఫరా చేస్తామని..ఈ టెక్నాలజీ కస్టమర్ ప్రవర్తన, ఆర్డర్ తీరును అంచనా వేస్తుందని కంపెనీ తెలిపింది. తాము రూపొందించిన బీ2బీ లాజిస్టిక్స్ వేదిక వల్ల డెలివరీ ఖర్చు చాలా తగ్గుతుందని వెల్లడించింది.  లిక్కర్ అగ్రగేటర్లకు డోర్స్ ఓపెన్ చేయాలన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆలోచనను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.తక్కువ వయస్సున్నవారు మద్యం ఆర్డర్ చేయకుండా చూస్తామన్న బూజీ నాణ్యమైన మద్యం అందిస్తామని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తల కోసం

35 నిమిషాల నా పాత్ర అందర్నీ ఆలోచింపజేస్తుంది

హరీష్ కు బర్త్ డే విషెస్ చెప్పిన కవిత..