హరీష్ కు బర్త్ డే విషెస్ చెప్పిన కవిత..

హరీష్ కు బర్త్ డే విషెస్ చెప్పిన కవిత..

రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ఈరోజు పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయనకు సోష‌ల్ మీడియా వేదికగా పలువురు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హరీష్ రావుకు ట్విట్టర్ లో బర్త్ డే విషెస్ తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టారు. బావా హ్యాపీ బర్త్ డే .. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటూ.. కవిత త‌న‌ పోస్ట్ లో పేర్కొన్నారు.అంతే కాకుండా ఈ సందర్భంగా పోస్ట్ చేసిన ఫొటోలో కవిత మరియు హరీష్ రావు ఉన్నారు. కాగా, మంత్రి హరీష్ రావుకు టీఆర్ఎస్ శ్రేణులు పుట్టిన రోెజు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

 

+++++++++++
 ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి హరీష్ రావు. ఆలయ అధికారులు హరీశ్ రావుకు సాదర స్వాగతం పలికారు. పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని  అభిషేక సేవలో పాల్గొన్నారు. తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి హరీష్ రావు. తర్వాత వేద పండితులు హరీశ్ కు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.