నిమజ్జన ఏర్పాట్లు మరింత పెంచాం.. అపోహలు నమ్మొద్దు: తలసాని

నిమజ్జన ఏర్పాట్లు మరింత పెంచాం.. అపోహలు నమ్మొద్దు: తలసాని

నిమజ్జన ఏర్పాట్లు మరింత పెంచామని, ఎవరూ అపోహలు నమ్మొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో నిమర్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. రేపటి(సెప్టెంబర్ 20) నుంచి గణేష్ నిమాజ్జనాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. నిమజ్జనం ఏర్పాట్లు అన్ని ప్రభుత్వం పకడ్బందీగా చేసిందని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 90వేల వినాయకులు ఉన్నాయని చెప్పారు. 

ALSO READ: బాలాపూర్ గణనాథునికి మంత్రి సబిత తొలి పూజ 

ఎవరు ఎక్కడ నిమర్జనం చేయాలో ముందే అందరికీ సమాచారం అందించామని తెలిపారు. నిమజ్జనం ఏర్పాట్లు మరింత పెంచామని అన్నారు. ఉత్సవ సమితి సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఎవరూ అపోహలు నమ్మొద్దని సూచించారు. ప్రశాంతంగా నిమర్జనం జరిగేలా అందరూ సహకరించాలని మంత్రి తలసాని కోరారు.

నిమజ్జన ఉత్సవాలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టామని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.