బోనాల పండుగను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది

V6 Velugu Posted on Aug 01, 2021

హైదరాబాద్‌లో బోనాల పండుగ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల సందర్భంగా లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయం ఘనంగా ముస్తాబైంది. అమ్మవారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు. తలసానితో పాటు హోంమంత్రి మహమూద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. సింహవాహిని అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మొక్కుకున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. ‘తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరమే బోనాలను సీఎం కేసీఆర్ రాష్ట్ర పండుగగా గుర్తించారు. 
మొదట గోల్కొండ బోనాలతో ప్రారంభమై.. గత వారం సికింద్రాబాద్ బోనాలు జరిగాయి. రేపు రంగం కార్యక్రమం తర్వాత ఊరేగింపు ఉంటుంది. బోనాల ఉత్సవాల కోసం రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. మొదటిసారి ప్రైవేట్ గుళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో విజయవాడలో కనకదుర్గమ్మని దర్శించుకోవడంతో పాటు ఢిల్లీలో కూడా బోనాల పండగను నిర్వహిస్తున్నా. తరతరాలుగా ఇది మన సంస్కృతి. దీనిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పండుగ కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం తరుపున అన్ని ఏర్పాట్లు చేశాం. అరిబోలిలో బంగారు మైసమ్మ, అక్కన్న మాదన్న దేవాలయం, గౌలిగూడ దేవాలయం ఎక్కడ చూసినా అశేష జనవాహిని ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. రెండు సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని.. భక్తులకు మాస్కులు, శానిటైజర్లు అందిస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు’ అని మంత్రి తలసాని అన్నారు.

Tagged Hyderabad, Minister Talasani Srinivas Yadav, Minister Indrakaran Reddy, Lal Darwaza Bonalu, Bonalu, minister muhammad ali

Latest Videos

Subscribe Now

More News