సనత్‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌ ను ఎంతో అభివృద్ధి చేశా : తలసాని శ్రీనివాస్​ యాదవ్

 సనత్‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌ ను ఎంతో అభివృద్ధి చేశా : తలసాని శ్రీనివాస్​ యాదవ్

సికింద్రాబాద్​, వెలుగు:  సనత్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో తన కంటే ముందు 50 సంవత్సరాలు అధికారంలో ఉండి చేయలేని పనులను తాను తొమ్మిదిన్నర సంవత్సరాల్లోనే చేశానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.  శనివారం రాత్రి సనత్‌‌‌‌నగర్ లోని జెక్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

2014కు ముందు రాష్ట్ర ఏర్పాటు పై అనేక మందికి ఎన్నో అనుమానాలు ఉండేవన్నారు.   సీఎం కేసీఆర్​ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ అనుమానాలన్నీ  తొలగిపోయాయని చెప్పారు.  ఏ ప్రాంతం వారైనా ఇక్కడ నివసిస్తున్న వారు తమ బిడ్డలేనని అన్నారు.  జెక్ కాలనీలో రోడ్ల  నిర్మాణం,  డ్రైనేజీ లైన్, వాటర్ లైన్ల, లైటింగ్ ఏర్పాటు వంటి పలు అభివృద్ధి పనులను చేపట్టిన విషయాన్ని వివరించారు. 

నియోజకవర్గ పరిధిలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, కనకదుర్గమ్మ, మహంకాళి అమ్మవారి ఆలయం లాంటి వివిధ ఆలయాలను ఎంతో అభివృద్ధి చేశామని వివరించారు.  సమావేశంలో కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, రాఘవయ్య, శ్రీహరి, సుబ్బరాజు, సురేశ్‌‌‌‌ చౌదరి, విశ్వనాథ రాజు, అనంతరెడ్డి, మల్లారెడ్డి, సురేశ్‌‌‌‌ గౌడ్, బాషా, సుమ, రమ, నాగమణి, అమరావతి తదితరులు పాల్గొన్నారు.