ముందస్తు ఎలక్షన్స్ రేపు వచ్చినా టీఆర్ఎస్ సిద్ధమే..

ముందస్తు ఎలక్షన్స్ రేపు వచ్చినా టీఆర్ఎస్ సిద్ధమే..

రాష్ట్రంలో ముందస్తు ఎలక్షన్స్ అంశం హీట్ పుట్టిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ముందస్తు ఎలక్షన్స్ పై చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా స్పందించారు. ముందస్తు ఎలక్షన్స్ రేపు వచ్చినా, మరేప్పుడు వచ్చినా తాము (టీఆర్ఎస్) సిద్ధమని చెప్పారు. బీజేపీ నేతలు ముందు ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్ రద్దు చేయాలని ప్రధాని నరేంద్రమోడీని అడగాలన్నారు.

పుట్ పాత్ మీద ఉన్నోళ్లు మాట్లాడితే తాము సమాధానం చెప్పాలా..? అని  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రిటైర్మెంట్ దగ్గరకు వచ్చి ఏదైనా మాట్లాడుతారు అంటూ మండిపడ్డారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు పట్టిన గతే మోడీకి పడుతుందని, కేంద్రమంత్రుల ఇండ్లళ్లకు వెళ్లి జనం ఆందోళన చేసే రోజు వస్తుందంటూ విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ కు అలాంటి పరిస్థితి రాదని, తామంతా బలంగా ఉన్నామని చెప్పారు.