ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని విజయ ఆయిల్ ఔట్లెట్, స్టాక్ పాయింట్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాంను కూడా పరిశీలించారు. స్టాక్ వినియోగదారుల డిమాండ్ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఆయిల్ ఉత్పత్తుల నాణ్యత, ధరలు, వినియోగదారులకు అందిస్తున్న సేవలపై మంత్రి సమీక్షించారు.
