రైతులకు మేలు చేసేలా సంస్కరణలు చేపట్టాలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రైతులకు మేలు చేసేలా సంస్కరణలు చేపట్టాలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రైతులకు మేలు చేసే విధంగా సంస్కరణలు చేపట్టాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గురువారం అగ్రికల్చర్, మార్కెటింగ్‌‌‌‌, కో ఆపరేటివ్‌‌‌‌ అనుబంధ కార్పొరేషన్ లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత పదేండ్ల కాలంలో కార్పొరేషన్ ల పనితీరు, అమలు చేసిన నిర్ణయాలు ప్రైవేటు వ్యక్తులకు మేలు చేసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థకు నష్టం వచ్చే నిర్ణయాలకు  బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. అవసరమైతే గతంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించి సంస్థకు, రైతులకు మేలు చేకూర్చే విధంగా సూచనలు చేయాలని సెక్రటరీని ఆదేశించారు. కార్పొరేషన్ల వారీగా ఐఏఎస్‌‌‌‌లను విచారణ అధికారులుగా నియమించి వాటి నిర్వహణపై సమగ్ర నివేదికలను10 రోజుల్లోపు ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు.