తెలంగాణ, దక్షిణ భారతదేశానికి గేమ్ ఛేంజర్ గా ఖమ్మం—దేవరపల్లి హైవే : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

తెలంగాణ, దక్షిణ భారతదేశానికి గేమ్ ఛేంజర్ గా ఖమ్మం—దేవరపల్లి హైవే : మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
  • ధంసలాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను తనిఖీ చేసిన తుమ్మల

ఖమ్మం టౌన్. వెలుగు : ఖమ్మం - దేవరపల్లి హైవే తెలంగాణ, దక్షిణ భారతదేశానికి గేమ్ చేంజర్గా మారబోతోందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. శనివారం ధంసలాపురం వద్ద ఖమ్మందే వరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను ఆయన తనిఖీ చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే ఆర్తోబీ, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. 

160 కిలో మీటర్ల జాతీయ రహదారి పూర్తి కావడం వల్లగం టన్నరలో రాజమండ్రి వెళ్లవచ్చని చెప్పారు. ఇది ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలిపే రహదారిగా తయారవుతుందన్నారు. ధంసలాపురం ఆర్ఓబీ నవంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశిం చారు. ఆర్టిబీ నిర్మాణానికి సంబంధించి హైటెన్షన్. విద్యుత్ లైన్స్ తరలింపు, భూసేకరణ లాంటి అన్ని పనులు పూర్తి చేశామని, నవంబర్ నాటికి ఒకవైపు రైల్వే బ్రిడ్జి పూర్తి చేసుకుంటే సత్తుపల్లి జంగారెడ్డిగూడెం వరకు ఉపయోగపడుతుందని చెప్పారు. 

రైల్వే. కెనాల్, మున్నేరు పై రహదారి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం నుంచిసత్తుపల్లి వరకుజాతీయ రహదారికి సర్వీస్ రోడ్లు వేస్తే రైతాం గానికి ఉపయోగ పడుతుందని చెప్పారు. నాగార్జు న్ సాగర్ కాల్వ కింద ఆయకట్టు ఉన్నందున 365 రోజుల పాటు హార్వెస్టర్ రాకపోకలు ఉంటాయని, రహదారి వాహనాలకు ఆటంకం కలగకుండా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

వర్షాలు తగ్గినందున మున్నేరు బ్రిడ్జి తో పాటు ధంసలాపురం ఎగ్జిట్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నా రు.రూ.3,500కోట్లతో ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి నిర్మిస్తున్నామని చెప్పారు. మంత్రి వెంట రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరా వు, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, నేషనల్ హైవే పీడీ దివ్య, ఆర్ అండ్ బీ.ఎస్ఈ యాకోబ్. ఖమ్మం ఆర్డీవో నర్సిం హారావు, కార్పొరేటర్లు, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సైదులు ఉన్నారు.