మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. గత కొన్ని రోజులుగా మిర్చి పంటపై రేటు తగ్గుతుండటంతో మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలో వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శులతో తుమ్మల సమీక్ష నిర్వహించారు. మిర్చి పంట ధరలు తగ్గడంపై కారణాలు అడిగి తెలుసుకున్నారు. ధరలు ఎందుకు తగ్గుతున్నాయో రైతులకు మైకుల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. మార్కెట్ యార్డులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మిర్చి కొనుగోళ్లు జరపాలని ఆదేశించారు.
మిర్చి రైతులు దగ్గర్లో ఉన్న కోల్డ్ స్టోరేజీలో తమ సరుకును నిల్వ చేసుకునేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతబంధు ఆధారంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి మిర్చి నిల్వ చేసిన రైతులకు రూ.2 లక్షల వరకు 6 నెలల పాటు వడ్డీ లేనిరుణాలుఇవ్వాలని ఆదేశించారు.
