పంటల కొనుగోళ్లకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటం : మంత్రి తుమ్మల

పంటల కొనుగోళ్లకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటం : మంత్రి తుమ్మల
  • రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం
  • రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులతో మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పంటల కొనుగోళ్లకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సెక్రటేరియెట్​లో రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు. 

మార్కెటింగ్‌‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర 

ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహాయ సహకారాలు లేకపోవడంతో పత్తి కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సోయాబీన్‌‌లో రంగుమారిన పంటను కొనుగోలు చేసేలా కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. 

మొక్కజొన్న పంటను రాష్ట్రం సొంత నిధులతో సేకరిస్తున్నదని, రైతుల విజ్ఞప్తి మేరకు ఎకరానికి 18 క్వింటాళ్ల పరిమితిని 25 క్వింటాళ్లకు పెంచినట్టు వివరించారు. పంటనష్టం నివేదికల్లో పొరపాట్లు లేకుండా గ్రామ పంచాయతీల నోటీసు బోర్డుల్లో ఉంచేలా అధికారులకు ఆదేశాలు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎక్కడైనా రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే మరోసారి పంటలను పరిశీలించి నమోదు చేయాలని సూచించారు.

సమయపాలన పాటించని ఆఫీసర్లను ఉపేక్షించం

ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు సమయపాలన పాటించకుంటే ఉపేక్షించమని వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. బుధవారం తన శాఖ పరిధిలోని హాకా, సీడ్ సర్టిఫి కేషన్ కార్పొరేషన్, సీడ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్, హ్యాండ్లూమ్, టెక్స్​టైల్స్​ ప్రధాన కార్యాలయాలను తని ఖీ చేశారు. సమయానికి హాజరుకాని కొంతమంది అధికారులపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల కమిషనర్లు, ఎండీలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.