
హైదరాబాద్: వచ్చేనెల 15 నాటికి రాష్ట్రంలోని 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళాశక్తి చీరలను పంపిణీ చేయనున్నట్టు చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు తెలిపారు.
ఇవాళ సచివాలయంలో జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన 4.34 కోట్ల మీటర్ల క్లాత్లో ఇప్పటి వరకు 3.65 కోట్ల మీటర్లు ఉత్పత్తి కాగా, 33.35 లక్షల చీరలు ఇప్పటికే జిల్లా గోడౌన్లకు చేరాయని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 6,900 మంది నేత కార్మికులకు ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు ఉపాధి లభించి, నెలకు రూ.18 నుండి రూ.22 వేల వరకు ఆదాయం వస్తోందని మంత్రి వివరించారు. చేనేత కార్మికుల రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలని, 6,780 మందికి లక్ష రూపాయల వరకు రుణమాఫీ లభించనున్నదని తుమ్మల తెలిపారు.
►ALSO READ | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై తెలంగాణలో పొలిటికల్ హీట్
నేతన్న భరోసా పథకం కింద ఈ ఏడాది 48.80 కోట్లు కేటాయించి. నేతలకు రూ.18,000, అనుబంధ కార్మికులకు రూ.6,000 చొప్పున ఏడాదిలో రెండు విడతలుగా ప్రోత్సాహకా లు అందజేయనున్నట్లు తెలిపారు. రాబోయే సంవత్సరానికి అన్ని ప్రభుత్వ శాఖల వస్త్ర ఆర్డర్లు టెస్కో ద్వారా తీసుకుని చేనేత సంఘాలకు వర్క్ ఆర్డర్లు ఇవ్వాలని మంత్రి సూచించారు. హైదరాబాద్లో ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు తరలించేందుకు త్వరలో చర్యలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. సమీక్షలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తది తరులున్నారు.