కోహెడ మార్కెట్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం :మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కోహెడ మార్కెట్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం :మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • 3న సీఎం రేవంత్​రెడ్డి శంకుస్థాపన చేస్తరు: తుమ్మల

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కోహెడ మార్కెట్ ను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జూన్‌‌ 3న సీఎం రేవంత్​రెడ్డి మార్కెట్ కు శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. సంబంధిత ఏర్పాట్లపై బుధవారం సెక్రటేరియెట్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, రైతులకు ఆధునిక సౌకర్యాలు కల్పించడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

వేదిక నిర్మాణం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్‌‌, తాగునీరు, విద్యుత్‌‌, పారిశుధ్యం, వైద్య సదుపాయం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. హాజరయ్యే రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కార్యక్రమ ప్రాంగణంలో శుభ్రత, ట్రాఫిక్ మళ్లింపు, వాహనాల పార్కింగ్‌‌ పై ఫోకస్​పెట్టాలని సూచించారు.