తప్పించుకోవాలని చూస్తే ఊరుకోం.. ఎల్ అండ్ టీ ప్రతినిధులకు ఉత్తమ్ వార్నింగ్

తప్పించుకోవాలని చూస్తే ఊరుకోం.. ఎల్ అండ్ టీ ప్రతినిధులకు ఉత్తమ్ వార్నింగ్
  • తప్పించుకోవాలని చూస్తే ఊరుకోం
  • ఏదో ఒక లెటర్ ఇచ్చి ప్రమేయం లేదంటే కుదురదు
  • మేడిగడ్డ కూలిపోవడానికి కారణమైన వారిని వదలం
  • ప్రజాధనం వృథా చేసినోళ్లపై చట్టపరంగా చర్యలు 
  • ఎల్ అండ్ టీ ప్రతినిధులకు మంత్రి ఉత్తమ్ వార్నింగ్ 

హైదరాబాద్ : ఏదో ఒక లెటర్ చేతిలో పెట్టి మా ప్రమేయం లేదని తప్పించుకోవాలని చూస్తే కుదురదని, మేడిగడ్డ పిల్లర్లు కుంగడానికి కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రతినిధులతో ఉత్తమ్ సమావేశం నిర్వహించారు. అంత పెద్ద  ప్రాజెక్టు నిర్మాణ పనులు నాసిరకంగా ఎలా చేశారని ప్రశ్నించారు. ప్రజా ధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. సమావేశంలో ఎల్అండ్ టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వీ దేశాయ్ తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. 

సమగ్ర నివేదిక ఇవ్వండి 

అన్నారం, సుందిళ్ల  ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వారు కూడా తప్పించుకోవాలని చూస్తే చట్టపరంగా ముందుకు వెళ్దామని తెలిపారు.