
- మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా కేసులో కోర్టుకు హాజరు
బషీర్బాగ్, వెలుగు: హైదరాబాద్ నాంపల్లిలోని మనోరంజన్ కోర్టుకు సినీ నటుడు అక్కినేని నాగార్జున, అతడి కొడుకు అక్కినేని నాగ చైతన్య హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తి ముందు నాగార్జున, చైతన్య స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడారు.
పరువునష్టం దావా కేసులో తాను కోర్టుకు హాజరైనట్టు నాగార్జున తెలిపారు. న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుందని చెప్పారు. న్యాయస్థానం ముందు తన స్టేట్ మెంట్ ను వినిపించినట్టు పేర్కొన్నారు. న్యాయస్థానం తదుపరి విచారణను సెప్టెంబర్ 24కు వాయిదా వేసింది.