ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఇంజనీర్లు పనిచేయాలి : మంత్రి ఉత్తమ్

ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఇంజనీర్లు పనిచేయాలి : మంత్రి ఉత్తమ్
  •     హెచ్ఈఏ డైరీ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి ఉత్తమ్ సూచన

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఇంజనీర్లు క్షేత్ర స్థాయిలో పనిచేయాలని ఇరిగేషన్​డిపార్ట్ మెంట్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్​ రెడ్డి సూచించారు. రాష్ట్రాభివృద్ధికి ఇంజనీర్లు తమ వంతు కృషి చేయాలని, చివరి ఆయకట్టు వరకు సాగునీళ్లిచ్చేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆయన కుందన్​బాగ్​లోని తన నివాసంలో.. హైదరాబాద్​ఇంజనీర్స్​అసోసియేషన్​(హెచ్ఈఏ) డైరీని ఆవిష్కరించారు. 

రాష్ట్రంలో మొదటిసారిగా 343 మంది ఇంజనీర్లకు ప్రతిభ, బ్యాచ్​సీనియారిటీ వారీగా డీఈఈ స్థాయి నుంచి ఈఎన్సీల వరకు నిష్పక్షపాతంగా ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించిందని అసోసియేషన్​ సభ్యులు చెప్పారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ రాపోలు రవీందర్, జనరల్​ సెక్రటరీలు చక్రధర్​, రమేశ్​ బాబు (ఈఎన్సీ అడ్మిన్)తో పాటు ఇరిగేషన్​డిపార్ట్ మెంట్ జాయింట్​సెక్రటరీ కె. శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.