V6 News

ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

ఉప్పల్, వెలుగు: ఉప్పల్​ స్టేడియంలో ఈ నెల 13న నిర్వహించనున్న ఫుట్​బాల్​ మ్యాచ్​ ఏర్పాట్లను క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మెస్సీతో సీఎం రేవంత్​రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్​ ఆడుతున్నారని, మ్యాచ్​ను తిలకించేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో అభిమానులు వస్తున్నట్లు తెలిపారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పలు విభాగాల అధికారులతో స్టేడియంలో నిర్వాహకులు, ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు.