‘ఖేలో తెలంగాణ’..  నిరంతర క్రీడా ఉద్యమానికి శ్రీకారం..పోస్టర్‌‌‌‌‌‌‌‌ ఆవిష్కరించిన మంత్రి వాకిటి శ్రీహరి 

‘ఖేలో తెలంగాణ’..  నిరంతర క్రీడా ఉద్యమానికి శ్రీకారం..పోస్టర్‌‌‌‌‌‌‌‌ ఆవిష్కరించిన మంత్రి వాకిటి శ్రీహరి 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని విస్తరించడంతో పాటు ప్రజల్లో శారీరక చైతన్యాన్ని పెంచే లక్ష్యంతో ‘ఖేలో తెలంగాణ’ పేరుతో నిరంతర క్రీడా కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌లో క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ‘ఖేలో తెలంగాణ’ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో క్రీడల ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, స్పెషల్‌‌‌‌‌‌‌‌ సీఎస్‌‌‌‌‌‌‌‌ జయేశ్‌‌‌‌‌‌‌‌ రంజన్‌‌‌‌‌‌‌‌, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ అథారిటీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ తెలంగాణ ఎండీ డాక్టర్‌‌‌‌‌‌‌‌ సోనీ బాలాదేవి, తెలంగాణ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ కార్యదర్శి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రోజుకు 30 నిమిషాలు ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌కు

‘ఖేలో తెలంగాణ బంధన్‌‌‌‌‌‌‌‌’లో భాగంగా ప్రజలు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం, వాకింగ్‌‌‌‌‌‌‌‌, జాగింగ్‌‌‌‌‌‌‌‌, యోగా వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించేలా ప్రోత్సహించనున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమకు అనువైన వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకునేలా కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దనున్నారు.

9+9+9 ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌

ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌పై అవగాహన పెంచేందుకు 9+9+9 ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించనున్నారు. ఇందులో 27 సెకన్ల ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ వీడియోను సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి, తొమ్మిది మంది మిత్రులను ట్యాగ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాటు మరో తొమ్మిది మందిని ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనాలని ఆహ్వానించాలి. రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌, బాక్సింగ్‌‌‌‌‌‌‌‌, వాలీబాల్‌‌‌‌‌‌‌‌, టేబుల్‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌, జూడో, బాస్కెట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌, అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌, ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌, సైక్లింగ్‌‌‌‌‌‌‌‌, యోగాసన తదితర క్రీడల్లో లీగ్‌‌‌‌‌‌‌‌ పోటీలు నిర్వహించేందుకు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ అథారిటీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ను జీవనశైలిలో భాగం చేయడం, క్రీడలను ప్రజలకు చేరువ చేయడం, ప్రతిభకు వేదికలు కల్పించడమే ‘ఖేలో తెలంగాణ’ లక్ష్యమని క్రీడల శాఖ తెలిపింది.