V6 News

హైదరాబాద్ అత్యంత సేఫ్ సిటీ: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్ అత్యంత సేఫ్ సిటీ: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్ ఇప్పుడు అత్యంత సేఫ్ సిటీ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని... తెలంగాణ ఏర్పడిన తరువాత 20 వేల పరిశ్రమలు వచ్చాయని పేర్కొన్నారు. హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. 

హైదరాబాద్ హైటెక్ సిటీలో NAREDCO నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. 


SRDP కింద మాత్ 36 ఫ్లై ఓవర్లు నిర్మించామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అండర్ పాస్ లు, రోడ్ కనేక్టీవ్ ని పెంచామని... దేశంలో 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వివరించారు. రాష్ట్రంలో ఇర్రిగేషన్ ప్రొజెక్టులపై రూ.1.5లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. పవర్ సెక్టార్ పై రూ. 1లక్ష కోట్లు ఖర్చు చేశామని.. క్వాలిటీ పవర్, వాటర్ అందిస్తున్నామని పేర్కొన్నారు. 

తెలంగాణ అభివృద్ది

టీఎస్ బీ పాస్ 21 రోజుల్లోనే నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్  ముందు చూపు, ఆలోచన ప్రకారం తెలంగాణ అభివృద్ది జరుగుతోందని చెప్పారు. రూరల్ ఎకానమీ పెంచితే...అది మంచి ఇన్వెష్ట్ అవుతుందన్నారు. ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అని మంత్రి స్పష్టం  చేశారు. 

తెలంగాణ తలసరి ఆదాయం

తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కు స్వర్గధామంగా ఉందని మంత్రి వేముల చెప్పారు. తెలంగాణ తలసరి ఆదాయం 2014 సంవత్సరంలో రూ 1.24 లక్షల కోట్ల నుంచి 2023 సంవత్సరంలో 3.12 లక్షల కోట్లకు పెరిగిందని మంత్రి వేముల ప్రవాంత్ రెడ్డి వెల్లడించారు.