- రక్షణ చర్యలు తీసుకోకపోవడం సరికాదు: మంత్రి వివేక్
- ఈఎస్ఐ హాస్పిటల్ ప్రమాద ఘటనలో గాయపడినవారికి పరామర్శ
జూబ్లీహిల్స్, వెలుగు: హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కార్మికులను మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం పరామర్శించారు. హాస్పిటల్ ఎమర్జెన్సీ బిల్డింగ్‌కు రెనోవేషన్ చేస్తుండగా, సోమవారం ప్రమాదవశాత్తు భానుచందర్ అనే కార్మికుడు చనిపోయాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మంత్రి వివేక్ పరామర్శించి హెల్త్ కండీషన్ గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
రక్షణ చర్యలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గాయపడినవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. చనిపోయిన భానుచందర్ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. ప్రమాదం జరిగితే కార్మికులు బయటపడేలా కాంట్రాక్టర్లు సేఫ్టీ చర్యలేవీ తీసుకోవడం లేదని మండిపడ్డారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని ఈఎస్ఐ హాస్పిటల్ డీన్ శిరీశ్ కుమార్ చౌహాన్‌కు సూచించారు.
