
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్ ఎస్ గ్యారంటీ కార్డు అంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది.. బీఆర్ఎస్ విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్బంగా గురువారం (అక్టోబర్16) సోమజిగూమ డివిజన్ లో బూత్ లెవెల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ ను గెలిపించుకునేందుకు ఇదే మంచి సమయం.. నవీన్ యాదవ్ ను 50 వేల మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తల సమస్యలు, ప్రజా సమస్యలను తీర్చే బాధ్యత తనదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
ఈ సమావేశంలో ఇంచార్జి మంత్రులు వివేక్ వెంకట స్వామి, తుమ్మల, పొన్నం, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించేరందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఉప ఎన్నికలో 70 శాతం ఓటింగ్ మొదటి టార్గెట్.. లక్ష మెజార్టీలో నవీన్ యాదవ్ గెలుపు రెండో టార్గెట్ గా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు.
గత బీఆర్ ఎస్ ప్రభుత్వం చేసేందేమీ లేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జూబ్లీహిల్స్ లో 40 కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కొన్నేళ్లుగా యూసుఫ్ గూడలో స్మశాన వాటిక నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం వారి పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం యూసుఫ్ గూడలో స్మశాన వాటిక నిర్మిస్తామన్నారు మంత్రి వివేక్.
గత పదేళ్లలో కేసీఆర్ కుటుంబం 20 వేల ఎకరాల భూములను దోచుకుంది. కేటీఆర్ కు టీవీల్లో మాట్లాడటం ఫ్యాషన్అయిపోయింది. సారు కారు పదహారు అన్నారు. కానీ కేసీఆర్ ది ఫెల్యూర్ లీడర్షిప్అన్నామంత్రి వివేక్ వెంటకస్వామి.
ఓట్ చోరీ పై రాహుల్ గాంధీ గళమెత్తారు.. దేశవ్యాప్తంగా అది సంచలనం అయింది.. కేంద్ర ప్రభుత్వం,ఈసీ కుమ్మక్కవడంతో దేశ వ్యాప్తంగా ఓట్ చోరీ జరిగిందన్నారు మంత్రి. రాష్ట్రంలో బీఆర్ ఎస్ బీజేపీతో కలిసి ఓట్ చోరీపై నోరు మెదపడం లేదన్నారు.. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి నాటకాలాడుతున్నారని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మంచి మెజార్టీతో గెలవబోతోన్నారని అన్నారాయన.