- అనీవా ఇంజినీరింగ్ సంస్థ చెక్కులు పంపిణీ
కూకట్పల్లి, వెలుగు: పేద విద్యార్థులకు కార్పొరేట్ సంస్థలు ఆర్థికసాయం చేయడం అభినందనీయమని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్జి.వివేక్వెంకటస్వామి అన్నారు. విద్యతోనే యువత, సమాజం అభివృద్ధి చెందుతాయని తెలిపారు. కూకట్పల్లిలోని అనీవా ఇంజినీరింగ్ ప్రైవేట్లిమిటెడ్ వారు 100 మంది జేఎన్టీయూ పేద విద్యార్థులను గుర్తించి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఆర్థికసాయం చేసేందుకు ముందుకొచ్చారు.
ఒక్కొక్కరికి రూ.15 వేల విలువైన చెక్కులను బుధవారం కేపీహెచ్బీ కాలనీలోని మంజీర ట్రినిటీ మాల్లో మంత్రి వివేక్ చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నేండ్లుగా పేద విద్యార్థులకు చేయూతనిస్తున్న అనీవా కంపెనీ యాజమాన్యాన్ని అభినందించారు. దేశ అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర కీలకమని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, బాగా చదువుకోవాలని సూచించారు.
పేద విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఏఐతో పోటీ పడగలిగేలా నైపుణ్యాలను సాధించాలని, లేదంటే భవిష్యత్లో రాణించడం కష్టమవుతుందని చెప్పారు. ఇంజినీరింగ్పూర్తి చేసినవారికి టామ్ కామ్ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు పొందే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. జేఎన్టీయూ వీసీ డాక్టర్కిషన్కుమార్రెడ్డి, రిజిస్ట్రార్డాక్టర్ ఎ.జయలక్ష్మి, ప్రిన్సిపాల్ జి.వి.నరసింహారెడ్డి పాల్గొన్నారు.
