
- విద్య, ఉపాధి, ప్రమోషన్లలో మాలలు నష్టపోయారు
హైదరాబాద్: మాలలు ఐక్యంగా ఉన్నప్పుడే వారికి దక్కాల్సిన హక్కులు దక్కుతాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మాలల సింహ గర్జనతో కొంత మంది నోర్లు మూతపడ్డాయని చెప్పారు. లక్డికాపూల్లోని వాసవీ సేవా కేంద్రంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము సింహ గర్జన సభ ఏర్పాటు చేసినప్పుపడు అది స్పాన్సర్ ప్రోగ్రాం అని ఎద్దేవా చేసిన వారికి చెంపపెట్టు లాంటి సమాధానాన్ని మాలలు తమ సంఘటిత శక్తితో చూపించారన్నారు. ఇంతకాలం సంఘటితంగా లేకపోవడం వల్లే విద్య, ఉపాధి, ప్రమోషన్లలో అన్యాయానికి గురయ్యారని చెప్పారు.
►ALSO READ | బలహీన వర్గాల నేత కాబట్టే రాజాసింగ్ రాజీనామా ఆమోదించారు: మంత్రి పొన్నం
ఎవరికైనా అన్యాయం జరిగితే తాను ఉండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ అంశంపై న్యాయం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని ఘనంగా సన్మానించారు.