రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని సింగరేణి సీఎండీని ఆదేశించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. డిసెంబర్ 21న సోమాజిగూడలో మంత్రి వివేక్ వెంకటస్వామి నివాసంలో వివిధ సమస్యలపై పబ్లిక్ నుంచి వినతి పత్రాల స్వీకరించారు వివేక్.. ఈ సందర్భంగా సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, సింగరేణి ఆసుపత్రుల్లో వైద్య సేవలకు సంబంధించిన పలు డిమాండ్లతో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా... సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల వైద్య చికిత్సకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని సింగరేణి సీఎండీని ఆదేశించారు మంత్రి వివేక్. గతంలో అంగీకరించిన అంశాల మేరకు, రిటైర్డ్ ఉద్యోగులకు అవుట్ పేషెంట్ (ఓపీ) చికిత్స సదుపాయాన్ని అమలు చేయాలని నూతన సీఎండీకి సూచించారు. అలాగే, కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫరల్ సదుపాయం కల్పించాలని సూచించారు. దీంతో పాటు స్థానిక సంస్థల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి గెలిచిన నూతన సర్పంచ్ లకు సన్మానం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
