రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గతంకంటే దుబ్బాకలో కాంగ్రెస్ జోష్ కనిపిస్తోంది..ఆ ప్రాంతంలో మెజార్టీ సర్పంచులను కాంగ్రెస్ గెలుచుకుంది.. అదే జోష్ లో మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించి దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగుర వేయాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
కాంగ్రెస్ ప్రభుత్వంలో దుబ్బాకలో అనేక అభివృద్ది పనులు చేపట్టామన్నారు. రూ.15కోట్లతో దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తున్నామన్నారు. మున్సిపాలిటీలకు రూ. 50లక్షల చొప్పు న నిధులు కేటాయించామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యాంరంటీలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు మంత్రి వివేక్. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నాం.. అర్హత కలిగి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు మంజూరు చేశామన్నారు. రైతులకు 2లక్షల రుణమాఫీ పూర్తి చేశామన్నారు.రుణమాఫీ కాని వారు ఎవరైనా ఉంటే వారి పేర్లు ఇస్తే రుణమాఫీ చేయిస్తానని హామి ఇచ్చారు.
గత ప్రభుత్వం పేదల సొంతింటి కలను ఏనాడు పట్టించుకోలేదు.. పదేళ్లు డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తూ వచ్చారన్నారు మంత్రి వివేక్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లు 100 ఎకరాల్లో ఫాం హౌస్ లు నిర్మించుకున్నారుగానీ పేదలను పట్టించుకోలేదన్నారు. ఇప్పటికే రాష్ట్రం వ్యాప్తంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించాం.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొనసాగుతోంది..ఇల్లు లేదు దరఖాస్తు చేస్తున్న ప్రతి పేదకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్. గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం దందా చేశారు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
