చిన్న వ్యాపారాలతో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం

చిన్న వ్యాపారాలతో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం

​సిటీ, వెలుగు : హైదరాబాద్ చింతల్ బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన జై భీమ్ టెంట్ హౌస్ ను  మంత్రి  వివేక్ వెంకటస్వామి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక యువత స్వయం ఉపాధితో ఎదగాలనుకోవడం అభినందనీయమన్నారు. ఇలాంటి చిన్న వ్యాపారాలు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను మరింత బలపడేలా చేస్తాయన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ  యువత అభివృద్ధికి అండగా నిలుస్తుందన్నారు.