క్రమశిక్షణ ఉంటేనే జీవితంలో సక్సెస్ అవుతారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రపంచంలో చాలా మంది క్రమశిక్షణ తోనే సక్సెస్ అయ్యారని చెప్పారు. హైదరాబాద్ లక్డికపూల్ లో కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రధానోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం గొప్ప విషయమని అన్నారు.
పుల్లయ్య గురుంచి చెప్తుంటే... తనకు నాన్న వెంకస్వామి గుర్తుకు వచ్చారని చెప్పారు. అందరికి మంచి డ్రీం ఉండాలి సాధించాలనే తపన ఉండాలి....దాని కోసం పని చేయాలని సూచించారు వివేక్. వర్క్ ప్లేస్ పరిస్థితులు ఎలా ఉన్నా తట్టుకొని నిలబడాలని చెప్పారు. తల్లిదండ్రులను సంతోష పెట్టాలని విద్యార్థులకు సూచించారు. తాము కూడా ప్రభుత్వం తరపున 150 ఏటీసీ సెంటర్స్ ను అందుబాటులో తెస్తున్నామని చెప్పారు వివేక్ . 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
