స్కిల్స్‌‌‌‌ ఉంటేనే కొలువులు..కంపెనీల్లో స్కిల్డ్ ఉద్యోగుల కొరత ఉంది: మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి

స్కిల్స్‌‌‌‌ ఉంటేనే కొలువులు..కంపెనీల్లో స్కిల్డ్ ఉద్యోగుల కొరత ఉంది: మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి
  • ఏటీసీల్లో 98 శాతం అడ్మిషన్లు అభినందనీయం
  • స్టూడెంట్స్‌‌‌‌ను సొంత పిల్లల్లా భావించి వారిని తీర్చిదిద్దే బాధ్యత ప్రిన్సిపాల్స్‌‌‌‌దే
  • ఐటీఐ ప్రిన్సిపాల్స్, ప్లేస్‌‌‌‌మెంట్స్ ఆఫీసర్లకు అవార్డుల అందజేత 

హైదరాబాద్, వెలుగు: స్కిల్స్ ఉంటేనే మార్కెట్‌‌‌‌లో ఉద్యోగాలు లభిస్తాయని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బయట ఉద్యోగాలు లేవన్నది వాస్తవం కాదు.. స్కిల్స్ ఉన్న ఉద్యోగుల కొరత ఉందన్నది వాస్తవమని పేర్కొన్నారు. కంపెనీలు కూడా ఇదే విషయం చెబుతున్నాయన్నారు. కంపెనీల అవసరాలకు తగ్గట్లు విద్యార్థుల్లో స్కిల్స్ పెంపొందించాల్సిన బాధ్యత ఏటీసీ ప్రిన్సిపాల్స్‌‌‌‌పై ఉందని చెప్పారు. సోమవారం హైదరాబాద్​రెడ్ హిల్స్‌‌‌‌లోని ఎఫ్‌‌‌‌టీసీసీఐ ఆడిటోరియంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన టీచర్స్ డే వేడుకల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.

 గతేడాది ఉత్తమ పనితీరు కనబరిచిన ఐటీఐ ప్రిన్సిపాల్స్‌‌‌‌, ప్లేస్‌‌‌‌మెంట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు, డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్లకు అవార్డులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కార్మిక శాఖలోని అన్ని విభాగాలతో కలిపి ఏర్పాటు చేసిన టీ గేట్ లోగో, పోస్టర్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌ టెక్నాలజీ సెంటర్స్‌‌‌‌ (ఏటీసీ)లో టాటా కంపెనీలు భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. 

రాష్ట్రంలో ఐటీఐలు, ఏటీసీలు బాగా పనిచేస్తున్నాయని, ఏటీసీల అభివృద్ధికి రూ.4 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏటీసీల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. ఇటీవల కొడంగల్ నియోజకవర్గంలో ఏటీసీ శంకుస్థాపనకు తాను వెళ్లానని గుర్తుచేశారు. ఏటీసీలు, ఐటీఐల్లో 98 శాతం అడ్మిషన్లు కావడం పెద్ద ఛాలెంజ్ అని, అయితే, వీటిని చేసి చూపించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ను నియమించి అడ్మిషన్లను స్పీడప్ చేశారన్నారు. 

మంత్రి వివేక్‌‌‌‌ విలువైన సలహాలు ఇచ్చారు: దాన కిశోర్‌‌‌‌‌‌‌‌

కార్మిక శాఖ మంత్రిగా వచ్చి 3 నెలలే అవుతున్నా వివేక్‌‌‌‌ వెంకటస్వామి ఎంతో విలువైన సలహాలిస్తూ కార్మిక శాఖను ముందుకు తీసుకెళ్తున్నారని కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ అన్నారు. అడ్మిషన్లు పూర్తి కావడంతో ప్లేస్‌‌‌‌మెంట్స్‌‌‌‌పై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారన్నారు. ఐటీఐ, ఏటీసీల్లో చదువుతున్న వారిలో 90 శాతం మంది బడుగు బలహీన వర్గాల పిల్లలే ఉన్నారని వెల్లడించారు. ఈ ఏడాది ఏటీసీల్లో 95 శాతం అడ్మిషన్లు కావడంలో స్పెషల్ ఆఫీసర్లు, ప్రిన్సిపాల్స్‌‌‌‌ కృషి మరువలేనిదన్నారు. 

క్లాస్ రూమ్ ట్రైనింగ్ కంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ ముఖ్యమని ఆయన అన్నారు. కోర్సులు పూర్తయిన వాళ్లకు 2 లేదా 3 వారాలు ట్రైనింగ్ ఇచ్చి, వారిని రాష్ట్ర ప్రభుత్వ ఇంజినీరింగ్ శాఖల్లో ఉద్యోగాల్లోకి తీసుకునేలా ఆయా శాఖలను కోరతామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి ఏటీసీలపై ప్రత్యేక దృష్టి పెట్టారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో 98 లక్షల మంది 19 ఏండ్ల నుంచి 25 ఏండ్ల యువత ఉన్నారని, వీరందరికీ స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉందన్నారు. గతేడాది నిర్మాణం స్టార్ట్ అయిన 60 ఏటీసీల పనులు పూర్తయ్యాయని, త్వరలో సీఎం, మంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ గంగాధర్, కార్మిక శాఖ జాయింట్ డైరెక్టర్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు.

ప్లేస్‌‌‌‌మెంట్స్‌‌‌‌పై దృష్టి పెట్టండి..

అడ్మిషన్లు పూర్తి కావడంతో ఇప్పుడు స్టూడెంట్స్‌‌‌‌కు ప్లేస్‌‌‌‌మెంట్స్ దక్కేలా ప్రిన్సిపాల్స్, ప్లేస్‌‌‌‌మెంట్ ఆఫీసర్లు, ఫ్యాకల్టీ దృష్టి పెట్టాలని మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి సూచించారు. చదువులో వెనుకబడిన స్టూడెంట్స్‌‌‌‌పై ప్రత్యేక ఫోకస్‌‌‌‌ పెట్టాలన్నారు. “ఏ ఇనిస్టిట్యూషన్స్‌‌‌‌లోనైనా ఫ్యాకల్టీ బాగుండాలి. మంచి టీచర్లు ఉన్నప్పుడే స్టూడెంట్స్ ఉన్నత స్థాయికి వెళ్తారు. ఐటీఐ, ఏటీసీల్లో ఉన్న 20 వేల మంది స్టూడెంట్స్‌‌‌‌ను ప్రిన్సిపాల్స్, ఫ్యాకల్టీ సొంత పిల్లలుగా భావించి వారిని తీర్చిదిద్దాలి. 

అవార్డులు వచ్చిన ప్రిన్సిపాల్స్, ఆఫీసర్లను.. రాని వాళ్లు ఆదర్శంగా తీసుకొని పోటీతత్వంతో పనిచేయాలి. నేను బేగంపేట పబ్లిక్ స్కూల్‌‌‌‌లో చదివిన. ఇక్కడ చదివిన వాళ్లు వరల్ట్ టాప్ 10 కంపెనీల సీఈవోలుగా ఉన్నారని గర్వంగా చెప్పుకుంటాం. ఇటీవల రిటైర్డ్ ప్రిన్సిపాల్స్, ఐటీఐ, ఏటీసీల్లో చదివి ఉద్యోగాలు పొందినోళ్లను, సొంతంగా వ్యాపారం స్థాపించిన వాళ్లకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాం. వీళ్లంతా ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నామని చెప్పటం గర్వంగా ఉంది” అని మంత్రి పేర్కొన్నారు.