మాజీ సీఎం రోశయ్యకు మంత్రి వివేక్ వెంకటస్వామి నివాళి

మాజీ సీఎం రోశయ్యకు మంత్రి వివేక్ వెంకటస్వామి నివాళి

మాజీ సీఎం రోశయ్య మంచి వ్యక్తిత్వం ఉన్న తెలివైన వ్యక్తి అని అన్నారు మంత్రి  వివేక్ వెంకటస్వామి.  రోశయ్య 92వ జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా రెండు తెలుగు రాష్ట్రాలకి కీలకంగా పనిచేశారని గుర్తు చేశారు.  ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కాంగ్రెస్ ను  ఎలా బలపరచాలి అనే దిశగా పనిచేశారని తెలిపారు.  కాక వెంకటస్వామితో ఎంతో సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు మంత్రి వివేక్.  కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఎలా పని చేయాలి అని ఎప్పుడు ఆలోచించేవారన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు జైపూర్ పవర్ ప్లాంట్ ని శంకుస్థాపన చేయడానికి రోశయ్య ముఖ్యఅతిథిగా వచ్చారని చెప్పారు. ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. 

దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్బంగా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నివాళి అర్పించారు.  హైదరాబాద్ రవీంద్ర భారతిలో దొడ్డి కొమురయ్య  వర్ధంతి  కార్యక్రమం సందర్భంగా పలువురు నేతలు నివాళి అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామి  దొడ్డి కొమురయ్య సేవలను గుర్తు చేసుకున్నారు. దొడ్డి కొమురయ్య  కుర్మ కులాలతో  తనకు దగ్గరి సంబంధం ఉందన్నారు వివేక్.  తన  నియోజకవర్గంలో కూడా కుర్మ సంఘానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారని చెప్పారు.  వెనుకబడిన కులాలను అభివృద్ధి చేసే దిశగా రాహుల్ గాంధీ కులగనని తీసుకొచ్చారని చెప్పారు.  ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా  సీఎం  రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.