4 ఏళ్ల కవలలకి పెళ్లి : ఇలా చేయపోతే దురదృష్టం వెంటాడుతుందని.. వైరల్ వీడియో..

4 ఏళ్ల కవలలకి పెళ్లి : ఇలా చేయపోతే దురదృష్టం వెంటాడుతుందని.. వైరల్ వీడియో..

మన దేశంలో కవలలు పుడితే  అదృష్టంగా లేకపోతే మంచిగా భావిస్తారు. ఇంకా కవలలు పుట్టాలంటే కూడా రాసిపెట్టి ఉండాలి అంటారు. అయితే కవలలు పుడితే వారికీ పెళ్లి చేయడం ఎక్కడైనా చూసారా... కవలలకి పెళ్లి ఏంటి అని అనుకుంటున్నారా...  వింతగా అనిపించినా ఇది ఒక మత ఆచారం కూడా...   

థాయ్‌లాండ్‌ దేశంలోని కలాసిన్‌లోని ప్రచయా రిసార్ట్‌లో గత నెల జూన్ 28న ఒక అరుదైన వేడుక జరిగింది. కేవలం నాలుగేళ్ల వయసున్న ఇద్దరు కవల పిల్లలు థట్సానాపోర్న్ సోర్న్‌చై (అబ్బాయి), థట్సాథోర్న్ (అమ్మాయి) పెళ్లి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు నెటిజన్లలో దీని పై చాల ఆసక్తి, ఆశ్చర్యం రెండింటినీ రేకెత్తించింది. అయితే ఈ వివాహం వెనుక థాయ్ బౌద్ధుల మధ్య ఉన్న ఒక సాంప్రదాయం, ఆచారం అని వెల్లడైంది.

వైరల్ అయిన ఈ వీడియోలో అతిథులు, బౌద్ధ గురువులు కోసం చేసిన ఏర్పాట్లు కూడా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో 4 ఏళ్ల వధువు, వరుడు ఆచారం ప్రకారం ముద్దు పెట్టుకోవడం చూడవచ్చు. ఆ తర్వాత పెళ్లి ఆచారాలను నిర్వహిస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. విశేషం ఏంటంటే బౌద్ధ సన్యాసులు, మతస్థులు ప్రత్యేక ఆచారాలతో ఈ కవల జంటను ఆశీర్వదించారు కూడా. 

ఈ వివాహంలో సాంప్రదాయ ఊరేగింపు కూడా ఉంది. వధువుకు నాలుగు మిలియన్ల థాయ్ బాట్ (థాయ్ కరెన్సీ) నగదుతో పాటు 180 బాట్ బరువున్న బంగారాన్ని ఇచ్చారు. ఈ కవలల తల్లి జోంగ్‌కాన్ సోంచాయ్ మాట్లాడుతూ "మా కవల పిల్లలు 14 జూన్ 2021న పుట్టారు. వారికి ఇప్పుడు నాలుగేళ్లు. విరిద్దరూ 14వ తేదీనే పుట్టడంతో తేదీలను కలిపి 28వ తేదీన పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాము" అని తెలిపారు.

ALSO READ : నెలకు వెయ్యి రూపాయల లక్కీ డ్రా స్కీం : 2 వేల మందిని 2 కోట్లకు ముంచాడు

కవలలకు థాయ్‌లాండ్‌లో ఎందుకు పెళ్లి చేస్తారు అంటే : 
థాయ్‌లాండ్‌లో ఇలాంటి పెళ్లీలు జరగడం వెనుక చాల నమ్మకాలు ఉన్నాయి. ఇలా కవలలు పుడితే థాయ్ బౌద్ధులు నమ్మకం  ప్రకారం వేర్వేరు లింగ కవలలు   పూర్వ జన్మలో ప్రేమికులుగా ఉండేవారని. కాబట్టి, వీలైనంత త్వరగా వారికి వివాహం చేయకపోతే అది దురదృష్టకరం అని వారు నమ్ముతారు. ఇలా  చేయకపోతే వారి జీవితాలను ఎప్పటికీ పూర్వ జన్మ దురదృష్టం వెంటాడతాయని నమ్ముతారు. అంతేకాదు, వీరు ఒకరినొకరు వివాహం చేసుకోకపోతే అనారోగ్యానికి గురవుతారని, పదే పదే  జబ్బుపడతారని చివరికి వారిలో ఒకరు మరణించే అవకాశం కూడా ఉందని బలంగా నమ్ముతారు.

ఈ వివాహంలో కవలలు సాంప్రదాయ బౌద్ధ వివాహ ఆచారాలు  పాటిస్తారు. ఇంకా వరకట్నం, ఊరేగింపులు, డ్యాన్సులు అలాగే బౌద్ధ సన్యాసులు ఆశీర్వదించడం వంటివి ఉంటాయి. ఈ ప్రత్యేకమైన ఆచారం థాయ్ సంస్కృతి, వారి ఆధ్యాత్మిక నమ్మకాలను చూపిస్తుంది.