
గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ 'హరి హర వీరమల్లు' స్వోర్డ్ అండ్ స్పిరిట్ మూవీ జులై 24న విడుదలకు సిద్ధం అవుతుంది. భారీ అంచనాలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో వీరమల్లు అనే పోరాట యోధుడి పాత్రలో పవన్ కల్యాణ్, ప్రతి నాయకుడి గా ఔరంగజేబు పాత్రలో బాబీడియోల్ నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.. 24 గంటల్లోనే యూ ట్యూబ్ లో 5 కోట్ల వ్యూస్ కు చేరింది.
ఈ ట్రైలర్ చూసిన పవన్ కల్యాణ్ అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. సంబరాల్లో మునిగితేలున్నారు. పవన్ ఎంట్రీ, డైలాగ్ డెలివరీ, ఆ సిగ్నేచర్ స్టైల్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించేస్తున్నాయి. అయితే టాలీవుడ్ లో ఇది వర్కవుట్ అయినా.. హిందీ వెర్షన్ లో ఇది అంత వర్కవుట్ కాదని బాలీవుడ్ విశ్లేషకుల నుంచి విమర్శుల వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే, ‘RRR’, ‘బాహుబలి’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘తానాజీ’ వంటి భారీ చిత్రాల కలయికలా అనిపిస్తోందంటున్నారు.
"హరి హర వీరమల్లు" ఒక పీరియాడికల్ ఫిల్మ్ . ఈ ట్రైలర్‌లో కనిపించే భారీ గ్రాండియర్, విజువల్స్ అన్నీ AI జనరేటెడ్‌లా, ఏదో వీడియో గేమ్ నుంచి తీసినట్లు అనిపిస్తున్నాయి. సినిమాలో యాక్షన్ భారీగా ఉన్నప్పటికీ, అది కొన్ని సినిమాల నుంచి ప్రేరణ పొందినట్లు స్పష్టంగా కనిపిస్తోందన్న వాదన విన్పిస్తోంది.
‘RRR’లో జూనియర్ ఎన్టీఆర్ పులి కళ్ళల్లోకి చూసిన తర్వాత, ప్రతి సినిమాలో ఒక పెద్ద పులినో, సింహాన్ని చూపించడం ఇటీవల సినిమాల్లో ఒక ట్రెండ్‌గా మారింది. అయితే ఎన్టీఆర్ కన్నా ముందే సల్మాన్ ఖాన్ ‘ఏక్ థా టైగర్’లో పులితో ఫైట్ చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక AI-జనరేటెడ్ తోడేలుతో ఫైట్ చేస్తున్నాడని ఈ ట్రైలర్ చూస్తేనే స్పష్టంగా కన్పిస్తోంది. భారీ బడ్జెట్ తో సినిమా తీసినప్పటికీ చాలా చోట్ల VFX చాలా వీక్ గా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. మూడు నిమిషాల ఈ ట్రైలర్ల ముఖ్యమైన ప్లాట్ లైన్ ను సూపించలేదు. భారీ పడవలు, కోటలు చూస్తుంటే ' సింద్ బాద్- ది సెయిలర్ ' కథను గుర్తుకు తెచ్చెలా ఉందని బాలీవుడ్ సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు..
ALSO READ : నెట్‌ఫ్లిక్స్ లోకి థగ్ లైఫ్.. డీల్ ఎన్ని కోట్ల నుంచి ఎంతకొచ్చింది?
రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్న 'హరి హర వీరమల్లు' మొదటి పార్ట్ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఏం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, సత్యరాజ్, తనికెళ్ల భరణి, విక్రమ్ జిత్, సునీల్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ అభిమానుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలంటే జులై 24 వేచి చూడాల్సిందే.