Thug Life OTT: నెట్‌ఫ్లిక్స్ లోకి థగ్ లైఫ్.. డీల్ ఎన్ని కోట్ల నుంచి ఎంతకొచ్చింది?

Thug Life OTT: నెట్‌ఫ్లిక్స్ లోకి థగ్ లైఫ్.. డీల్ ఎన్ని కోట్ల నుంచి ఎంతకొచ్చింది?

కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో 36 ఏండ్ల తర్వాత వచ్చిన సినిమా థగ్ లైఫ్. ఈ మూవీలో కోలీవుడ్ యంగ్ హీరో శింబు, హాట్ బ్యూటీ త్రిష, సీనియర్ నటి అభిరామి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా రిలీజ్కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో మణిరత్నం, కమల్ హాసన్ ఎదో మ్యాజిక్ చేస్తారని ఊహించినవారికీ భంగపాటు ఎదురైంది. జూన్ 5న థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దానికితోడు మణిరత్నం నాసిరకం వర్క్ అని ఓ రేంజ్లో ఆడియన్స్ విమర్శలు గుప్పించారు.

ALSO READ | NC24: నాగ చైతన్య మైథికల్ థ్రిల్లర్ అప్డేట్..

ఇప్పుడీ థగ్ లైఫ్ సినిమా జులై 3న ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలోనూ అందుబాటులోకి వచ్చింది. నిజానికి శుక్రవారం (జులై 4) నుంచే మూవీ స్ట్రీమింగ్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఒక రోజు ముందే రావడంతో సినీ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. 

ఇదిలా ఉంటే.. డిజిటల్ రైట్స్ను థగ్ లైఫ్ రిలీజ్కు ముందే నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఏకంగా రూ.135 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. కానీ సినిమాకు నెగటివ్ రివ్యూలు రావడం, బాక్సాఫీస్ ఫెయిల్యూర్తో దానిని రూ.110 కోట్లకు తగ్గించేసింది.

వాస్తవానికి ఈ సినిమాను థియేటర్స్లో రిలీజ్ అయ్యాక.. ఎనిమిది వారాలకు స్ట్రీమింగ్ చేసేలా డీల్ క్లోజ్ చేసారు. కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక యునానిమస్ డిజాస్టర్ టాక్ తెచుకోవడంతో నాలుగు వారాలలోనే స్ట్రీమింగ్కు తీసుకు వచ్చింది. మరి, థగ్ లైఫ్ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.